మీ న్యూస్ మార్చ్ 25::హుజూర్ నగర్ పట్టణంలో మార్చి 30 వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి “చేతుల మీదుగా రేషన్ కార్డులో పేర్లు ఉన్నా ప్రతి ఒక్కరికి 6 కేజిల సన్న బియ్యం పంపిణి కార్యక్రమానికి విచేస్తున్న సందర్బంగా మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జాయింట్ సెక్రటరీ ప్రియాంక అలా పరిశీలించారు.ఈ సందర్బంగా జాయింట్ సెక్రటరికి జిల్లా కలెక్టర్ సభా ఏర్పాట్లపై,హెలిప్యాడ్ స్థలం, వి ఐ పి ల పార్కింగ్,సభకి వచ్చే ప్రజలకి ఏర్పాటు చేసిన పార్కింగ్ లను చూపించి వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, డి యమ్ ప్రసాద్,తహసీల్దార్ నాగార్జునరెడ్డి,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.