⏩::సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మీ న్యూస్ ప్రతినిధి::మోతే: ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 26న సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. సోమవారం మోతే మండల కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని వెంటనే స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ పరిధిలో ఎండిపోయిన పంటలకు ఎకరాకు 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పింఛన్లు, రుణ మాఫీ, రైతు భరోసా అమలు చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులు అన్ని గ్రామాలలో ప్రారంభించి అర్హులైన వారందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. అనేక గ్రామాలలో, ఆవాసాలలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు నాగం మల్లయ్య, బానోతు లచ్చిరాం నాయక్, చర్లపల్లి మల్లయ్య, దోసపాటి శ్రీనివాస్,బూడిద లింగయ్య, ప్రజా సంఘాల నాయకులు వెలుగు మధు చేగువేరా, బానోతు వెంకన్న, చెరుకు శ్రీను, బానోత్ రమేష్, శీలం సతీష్, తదితరులు పాల్గొన్నారు.