మీ న్యూస్ ప్రతినిధి::మోతె మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో యాతకుల వారి శ్రీ రేణుక యల్లమ్మ తల్లి ఆలయం మంగళవారం ప్రారంభోత్సవం కార్యక్రమం లో పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు, మాజీ వార్డ్ మెంబర్లు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.