జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ ఐపీఎస్

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ ఐపీఎస్

⏩::స్వాగతం పలిపిన జిల్లా ఆదనపు ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు, AR అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి.

⏩::సూర్యాపేట జిల్లా ఎస్పి గా నరసింహ ఐపిఎస్ గారికి శుభాకాంక్షలు తెలిపిన DIG సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ 

 

మీ న్యూస్ మార్చి 10::సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె నరసింహ ఐపీఎస్ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు డీఐజీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి నుండి ఎస్పీగా నరసింహ ఐపిస్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ గారికి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, DSP లు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు మట్టయ్య, నరసింహ చారి, AO మంజు భార్గవి, CI లు, SI లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలిపి శుభాకాంక్షలు తెలిపినారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.నరసింహ ఐపీఎస్ జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించి సిబ్బంది అందరూ జిల్లాల్లో శాంతిభద్రతల రక్షణకు, పౌరుల రక్షణకు, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై సత్వరం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని అన్నారు. అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని అక్రమ రవాణా పై ముందస్తుగా సమాచారం సేకరించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ నందు సిబ్బందికి క్రమశిక్షణ అనేది అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు, విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. మహిళలు, పిల్లలు సంభందించిన కేసుల్లో ప్రణాళిక ప్రకారం పని చేయాలి. పేకాట, గంజాయి తరలింపు, ఇసుక అక్రమ రవాణా, PDS బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. DSP లు, CI లు పోలీసు విధులు, కేసుల దర్యాప్తు, కేసుల నమోదు, స్టేషన్ నిర్వహణ పై క్షేత్ర స్థాయిలో నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు.

శాంతిభద్రతలు, పౌరుల రక్షణ ముఖ్యవిధి

అక్రమ వ్యాపారాలు, అసాంఘిక చర్యలకు పాల్పడే వారి పట్ల ఉపేక్షించేది లేదు

మహిళలను, పిల్లలను వేదింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవ

24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు సేవలు అందిస్తాం

K. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా

సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పౌరుల రక్షణ కు అధిక ప్రాధాన్యమిస్తూ జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి విలువైన పోలీస్ సేవలు వేగంగా అందిస్తామని అన్నారు. మహిళల పట్ల, పిల్లల పట్ల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల పిల్లల ఫిర్యాదులకు సంబంధించి అత్యంత వేగంగా పనిచేస్తామని తెలిపారు. ఈవ్ టీజింగ్ చేసే వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు. వ్యవస్థీకృత నేరాలు అదుపులో ఉన్నాయని ఇలాంటి నేరాలు జరగకుండా దృష్టి సారిస్తామని తెలిపారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి తరచుగా ఇలాంటి నేరాలు చేసే వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. PDS రైస్ అక్రమ మార్గంలో అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవు అన్నారు. గంజాయి రవాణా, వినియోగం ఇసుక అక్రమ రవాణా, పేకాట లాంటి వాటిపై కటినంగా వ్యవహరించి అదుపు చేస్తామని తెలిపినారు. చదువుకున్నవారే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారని సైబర్ మోసాల పై ప్రణాళికతో పని చేస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. డయల్ 100 కాల్స్ పై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ప్రజలు నిర్వహించుకునే పండుగలు, సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ రక్షణ కల్పిస్తామని తెలిపారు. చైన్ సిస్టమ్ వ్యాపారం మోసపూరితమైనదని ఇలాంటి వ్యాపారం చేసే వారిపై సమాచారం ఇవ్వాలి, బాధితులు పిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, మట్టయ్య, నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, CCS ఇన్స్పెక్టర్ శివకుమార్, CI లు రాజశేఖర్, వీర రాఘవులు, రఘువీర్ రెడ్డి, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, రజిత రెడ్డి, రాము, RI నారాయణ రాజు, నరసింహ, SI లు, RSI లు, సిబ్బంది ఉన్నారు.