సరైన సమాచారం ఇచ్చి

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

సరైన సమాచారం ఇచ్చి

ఏమ్యులేటర్లకు సహకరించాలి

మీ న్యూస్ ప్రతినిధి :::

సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మీ ఇంటికి వచ్చేటువంటి ఎమ్యూ లేటర్లకు వారు అడిగిన దానికి సరైన సమాచారం ఇచ్చి సర్వే విజయవంతానికి సహకరించాలని మునిసిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ సూర్యాపేట పట్టణ ప్రజలను కోరారు. మంగళవారం పట్టణంలో సర్వే జరుగుతున్న తీరను పరిశీలించి వారు మాట్లాడుతూ మీ ఇంటి వద్దకు వచ్చే ఏమ్యూ లెటర్లకు ఆధార్, రేషన్ కార్డ్ పట్టాదార్ పాస్ బుక్ నెంబర్లు చూపించి తదుపరి జవాబు ఇవ్వగలరని కోరారు.ముఖ్యంగా ఎవరు ఎటువంటి జిరాక్స్ కాపీలు ఇవ్వనవసరం లేదు. వారు అడిగిన సమాచారం తెలియజేస్తే సరిపోతుందన్నారు. సర్వేలో భాగంగా మీ ఇంటి ముందు స్టిక్కర్ వేయకుంటే లేదా స్టిక్కర్ వేసే సమయంలో మీరు అందుబాటులో లేకుంటే వార్డ్ ఆఫీసర్ కు తెలియజేస్తే వారు ఎంటర్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ సత్య రావు, డీలింగ్ అసిస్టెంట్ గోపారపు. గౌస్ ద్దీన్, మనోజ్, ఎస్ ఎస్ ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.