శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు సిపిఎం
ప్రభుత్వ పర్మిషన్ లేని టి హెచ్ జూనియర్ కాలేజీ దానికి సహకరించిన శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు సిపిఎం
మీ న్యూస్ ప్రతినిధి::తాండూరు పట్టణంలో ప్రైవేట్ కాలేజీలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూప్రభుత్వం పర్మిషన్ లేకుండా కొనసాగిస్తున్న జూనియర్ కాలేజ్ ల పై చట్టపరమైన చర్య తీసుకోవాలని *వికారాబాద్ జిల్లా గారికి పిర్యాదు చేయడం జరిగింది సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు తాండూరు పట్టణంలో అనుమతి లేకుండా పర్మిషన్ లేకుండా అనేకమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న టి హెచ్ కాలేజ్ పై ప్రభుత్వo జిల్లా కలెక్టర్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులని మోసం చేస్తున్న జూనియర్ కాలేజీ యజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు గతంలో కూడా తాండూరు చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థుల నుండి ఎక్సమ్ ఫీజులు తీసుకొని ఎగ్జామ్ రాయించకుండా మోసం చేసిన అనేక మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న తాండూరు చైతన్య జూనియర్ కాలేజీ ల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇలాంటి అవినీతి అక్రమాలు మోసం చేసిన చైతన్య జూనియర్ కాలేజ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాండూరు పట్టణానికి చెందిన నోడల్ ఆఫీసర్ చూసి చూడనట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గం అని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లని బలోపేతం చేయకుండా సిబ్బందిని నియమించకుండా గెస్ట్ ఫ్యాకల్టీని నియమించకుండా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కాలేజీలకు సహకరిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ ఇలాంటి అనుమతి లేని జూనియర్ కాలేజీలకు సహకరిస్తూ మోసానికి పాల్పడుతున్న తాండూర్ చైతన్య జూనియర్ కాలేజీ పై చర్య తీసుకొని పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బుస చంద్రయ్య మరియు రాజు తదితరులు పాల్గొన్నారు