గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు

మీ న్యూస్ ప్రతినిధి :: సూర్యాపేట గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింతగా నిధులను కేటాయించి సహకారం అందిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు చెప్పారు.

E¢57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయంలో ప్రముఖ సాహితీవేత్త పెద్దిరెడ్డి గణేష్ అధ్యక్షతన కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కవి సమ్మేళ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ కవి సమ్మేళనాలు నిర్వహించడం, కవులను సన్మానించడం సాంప్రదాయంగా వస్తున్నదని చెప్పారు. తెలుగువారి జీవితాలలో సాహిత్యానికి ప్రాముఖ్యత ఉన్నదని, నాడు కవులు నన్నయ, అల్లసాని పెద్దన, నుంచి శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజాలు తదితర కవుల అందరికీ ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని వివరించారు. కవి సమ్మేళనానికి నిర్వాహకులుగా ప్రముఖ కవులు శీల అవిలేను జి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. జిల్లాలోని అన్ని మూలల నుండి అనేక మంది కవులు ఈ కార్యక్రమానికి హాజరై వారి కవితల్ని కవిత గానం చేసి శ్రోతలను అలరింపజేశారు. అనంతరం కవిత గానం చేసిన కవులఅందరికీ ప్రతి శాలువా ప్రశంసా పత్రాలతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, సాహితీవేత్త పెద్దిరెడ్డి గణేష్, గ్రంధాలయ అధికారి శ్యాంసుందర్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. గ్రంథాలయం తరఫున ప్రశంస పత్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కవులు ఎన్ సి రోజా, కె.శ్రీనివాస్, డాక్టర్ కృష్ణ బంటు,గడ్డంకృష్ణారెడ్డి, కృష్ణమాచార్యులు,కోడిరెక్క విజయ్ కమార్, డాక్టర్ సైదులు, ఏబెల్ శశి, హమీద్ ఖాన్, అలీముద్దీన్, జానకి రాములు, శ్రీనివాస చారి, వీరాచారి, ఉపేంద్ర చారి, నరసయ్య,జానయ్య, సహాయ గ్రంథ పాలకులు వడ్డే శ్యాంసుందర్ రెడ్డి, గ్రంథా పాలకులు కే విజయభాస్కర్, సైదా, వెంకట్ , నిర్మల లక్ష్మి, శ్రీనివాస్, రంగారావు ఇతర గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.