సూర్యాపేట జిల్లా మోతే మండలం సిఐటియు మండల కమిటీ సమావేశం సిహెచ్ రవిచంద్ర అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం రాంబాబు సిఐటియు జిల్లా అధ్యక్షులు మరియు ఎస్ రాధాకృష్ణ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు హాజరై మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి అనేక వాగ్దానాలు చేసింది కానీ సంవత్సరం గడుస్తున్నా నేటికీ అమలు చేయడంలో ఎలాంటి చొరవ చూపడం లేదు కార్మిక వర్గం ఆందోళన గురి అవుతుంది గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేసిన సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని ఆనాడు కాంగ్రెస్ నాయకులు చెప్పారని కానీ నేడు పరిష్కరించడంలో విఫలం చెందారని అన్నారు రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యవసర వస్తువులు కూరగాయల ధరలు పెరిగిపోవడం వలన పాలకులు ధరలను నియంత్రించకపోవడం వలన కార్మిక వర్గం ఆర్థిక ఇబ్బంది పడుతుంది అని అన్నారు క్రింది స్థాయిలో గ్రామపంచాయతీ కార్మికులపై నిత్యo వేధింపులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు భవన నిర్మాణ కార్మికులకు రక్షణగా ఉన్న వెల్ఫేర్ బోర్డును కేంద్ర ప్రభుత్వం నెరవేరియన్ చేసి ప్రైవేట్ సంస్థలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు దారాదత్తం చేసే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికుల డిమాండ్ చేసిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని ఎన్నికల మేనిఫెస్టో తెలియజేసిందని గెలిచిన తర్వాత వాటిని భూ పరిష్కారం కొరకు నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బొమ్మ గాని వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఒగ్గు సైదులు పరశురాములు వీరారెడ్డి గురవయ్య స్కైలాబు చంద్రయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు