ఎస్. జీ.టి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన అటెండర్ కూతురు సౌజన్య ని సన్మానించి
ప్రముఖ సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు
మీ:: న్యూస్ అక్టోబర్ 14..సిద్దిపేట జిల్లా : అక్టోబర్14, (హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం / కోహెడ మండలం) కోహెడ మండల కేంద్రానికి చెంది గజ్జెల మల్లయ్య(అటెండర్ ) – అమృత దంపతులకు ఇద్దరు సంతానం కాగా అందులో ఏకైక పుత్రిక గజ్జెల సౌజన్య ఎస్. జీ. టి ఉపాధ్యాయ ఉద్యోగం కీ ఎంపికైన సందర్బంగా ప్రముఖ సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ఈరోజు వారి నివాసంలో సౌజన్య ను ప్రత్యేకంగా అభినందించి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ సౌజన్య చిన్నప్పటినుండి చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచేవారు. కోహెడ లో ప్రాథమిక విద్యాబ్యాసం మరియు ఇంటర్ పూర్తి చేసి కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివి, హుస్నాబాద్ సంఘామిత్ర డైట్ కాలేజీలో టి. టి.సి కోర్సు పూర్తి చేసి టెట్ లో ఉత్తమ మార్కులు సాదించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డీ. ఎస్సి 2024 లో ఉత్తమ ప్రతిభ ను కనబర్చి ఎస్.జీ. టి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపిక కావడం చాలా గొప్ప విషయం అని రాజు పేర్కొన్నారు. అనంతరం తల్లిదండ్రులకు, గురువులకు సోదరులకు తనకు సహకరించిన మిత్రులకు శ్రేయోభిలాషులకు సౌజన్య కృతఙ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో గజ్జెల కృష్ణ,వేల్పుల సంపత్, శంకర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.