నాగన్న కు అవార్డు రావడం ప్రజల పాటకు దక్కిన గౌరవం 

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

నాగన్న కు అవార్డు రావడం ప్రజల పాటకు దక్కిన గౌరవం 

 మీ:: న్యూస్ అక్టోబర్ 13..            మోతె అరుణోదయ నాగన్న కు సుద్దాల హనుమంతు జాతీయ అవార్డు దక్కడం ప్రజా పాటకు దక్కిన గౌరవం మని తెలంగాణ సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా కార్యదర్శి గంట భిక్ష పతి అన్నారు ఆదివారం మండల కేంద్రం లోని అరుణోదయ నాగన్న అవార్డు కర పత్రం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలను పాట గా మలిచి తన గొంతు తో వేలాది పాటలు పాడి నమ్ముకున్న కమ్యునిజం సిద్ధాంతాన్ని వదిలి పెట్టకుండా తనను అనేక సార్లు నిర్బంధాలకు గురి చేసిన అక్రమ కేసులు పెట్టిన ప్రలోభాలకు గురి చేసిన ఎలాంటి వాటికి తన వ్యకతిత్వాన్ని వధులు కోలేదని చెప్పారు ప్రజా పంథా లో నూతన ప్రజా స్వామిక విప్లవ సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడం తో సుద్దాల ఫౌండేషన్ సుద్దాల అశోక్ తేజ ఈ అవార్డు కు అరుణోదయ నాగన్న ను ఎంపిక చేయడం పట్ల యావత్ తెలంగాణ కళా కారులు కలాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం లో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా ఉపాధ్యక్షులు పల్లెల రాము సారధి కళా కారులు పల్లెల లక్ష్మణ్ కుందమల్ల నాగలక్ష్మి జాన పద కళా కారులు సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగాని వెంకన్న గౌడ్ బాలల హక్కుల పరి రక్షణ జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు సాలయ్య కళా కారులు రఘు కంకణాల అంజయ్య శాంతి పెరమయ్య మాల్సూర్ వెంకన్న వీరన్న తదితరులు పాల్గొన్నారు