సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ మార్కెట్ కమిటీ మాజీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ 

Uncategorized అంతారం తాండూర్ రాజాకియం వికారాబాద్

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ మార్కెట్ కమిటీ మాజీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ 

 మీ న్యూస్ ప్రతినిధి:: తాండూర్ మండలం : అంతారం (దస్తగిరి పేట) గ్రామానికి చెందిన బుడిగ జంగం రాములు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందుటకు ఆయనకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కుని ) తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ గురువారం నాడు అంతారం గ్రామంలోని ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కుని) పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి శ్రీనివాస్, బొడ్డే అనంతయ్య, సంగం శ్రీనివాస్, తాండ్ర యేసు, వెంకట్, తుమ్మలపల్లి నర్సిములు, గోపాల్, బంటు లింగప్ప, తదితరులు పాల్గొన్నారు