డివైడర్ కు బైక్ ఢీకొని యువకుడు మృతి

Uncategorized క్రైమ్ నల్లగొండ మోతే సూర్యాపేట

 రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 

 మీ:: న్యూస్ అక్టోబర్ 14..మోతె: డివైడర్ కు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిదిలో హుస్సేనాబాద్ గ్రామ సమీపంలో 365 బిబి జాతీయ రహదారిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం చివ్వెంల మండలంలో సూర్యానాయక్ తండాకు చెందిన జటోతు వీరన్న (21) సోమవారం తెల్లవారు జామున పల్సర్ బైక్ పై కూసుమంచి మండలంలో గుర్వాయి గూడెం తన పెద్దనాన్న ఇంటికి వెళుతుండగా తన మోటారు సైకిల్ ను అతి వేగంగా అజాగ్రత్తగా నడిపి కంట్రోల్ తప్పి హుస్సేనాబాద్ గ్రామం సమీపంలో బైకు డివైడర్ ను ఢీకొనడంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.తన తండ్రి జటోతు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి తెలిపారు.