జోరుగా మద్యం మాపియా…?

Uncategorized జహీరాబాద్ సంగారెడ్డి

జోరుగా మద్యం మాపియా…?

మం.ఆర్. పి రేట్ కంటే అధికధరలకు అమ్ముతున్న వైన్స్ యాజమాన్యం

– చూచి చూడనట్లు ఆబ్కారీ అధికారులు 

తమ ఇష్టనుసరంగా వ్యవరిస్తున్న వైన్స్ నిర్వహితులు

 

-పేదోడీ కడుపు కొడుతు సొమ్ము చేసుకుంటున్న వైనం..

 

మీ::న్యూస్ ప్రతినిధి 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలలో ప్రభుత్వం నిబంధన ల ప్రకారం రెండు వైన్స్ షాపులు మాత్రమే మద్యం విక్రయించాలి కానీ మద్యం వ్యాపారాలు తమ ఇష్ట రాజ్యాంగ మద్యం అమ్ముతున్నారు మద్యం దుకాణ దారులు ఒక ఆటోను ఏర్పాటు చేసుకుని ఆటో (TG15T0294)నెంబర్ గల ఆటోలో వైన్స్ వ్యాపార స్తులు ఊరురా తిరుగుతూ మద్యాని కిరాణాదుకనలో అధిక రెట్లకు విక్రయయిస్తున్నారు కోహీర్ మండలానికి మొత్తం రెండు వైన్స్ షాపులకు గాను ప్రభుత్వం అనుతులిస్తే ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగ కోహీర్ మండలం లోని ఆయా గ్రామాలను పూర్తిగా మద్యం దుకాణాలు గ తలపించేలా చేస్తున్నారు ఒకటి రేణుక మాత లిక్కర్ మార్ట్ వైన్స్, రెండవది తిరుమాల వైన్స్ల యాజమాన్యం మద్యం సరఫరా దందా జోరుగా సాగుతుంది. వైన్స్ షాపులు యాజమాన్యం సిండికేట్ గ గ్రామాలలో ఏర్పాట్లు చేసి అధిక ధరలకు మద్యం అమ్ముతు.బెల్ట్ షాపుల యాజమాన్యం గల్లా నింపుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయఇస్తున్నారు . గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకొని తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు సమయం ఎంతైనా… మద్యం దొరుకుతుందనే అనే తరహాలో అందుబాటులో ఉంటున్నాయి. మండల పరిధిలో ఇరవై మూడు గ్రామాలు ఉండగా పలు గ్రామాల మినహా మిగిలిన అన్ని గ్రామాలలో కిరణ షాపులు విచ్చలవిడిగా మద్యం అమ్ముతునట్లు సమాచారం .పగలు రాత్రి అనే తేడా లేకుండా స్థానికంగా ఉన్న వైన్స్ దుకాణాల నుండి మద్యం అధిక ధరలకు కొనుగోలు చేసి అంతకంటే రెండంతలు రేట్లు పెట్టీ.మద్యం అమ్ముతున్నారు ఒకొక్క మద్యం బాటిల్ల దగ్గర. రూ ..నలపై నుండి యాభై రూపాయలు అధికంగా వసులు చేస్తునట్టు తెలుస్తుంది మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు అటు వైన్స్ యజమానులు ఇటు గ్రామాల్లో కిరణ దుకాణం దారులు సామాన్య నుని నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. కిరణ దుకాణం దారులు ఇళ్లలోనే మద్యం బాటిల్లను దాచి అవసరమైన వారికీ ఒక్కొక్కటిగా తీసుకువచ్చి ఇస్తున్నారు. కిరాణం షాపు ముసుగులో మద్యం సీసాలు అమ్ముతు. రాత్రి పగలు తేడా లేకుండా వినియోగదారులు జేబులు ఖాళీ చేసుకొని అనారోగ్యం భారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. అతి చిన్న వయసులోనే మద్యం సేవిస్తూ నిరుపేద కుటుంబాలకు భారమవుతున్నారు. రోజురోజుకు గ్రామాలలో బెల్ట్ షాపులు ఆగడలు విచ్చలవిడిగా సాగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా . వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.మీ న్యూస్ ప్రతినిధి కే. అశోక్