కోదాడ మార్చి (మీ న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జి )
సోమవారం మున్సిపల్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ లో నిర్మించిన ఎస్ఆర్ఎం పాఠశాల ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ కేసినేని శ్రీదేవి ఆధ్వర్యంలో కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉన్నత ఫలితాలు సాధించి పుట్టిన స్థలానికి, పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు ఎస్ఆర్ఎం పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల కు తక్కువ ఫీజుతో కార్పొరేట్ విద్యను అందించి విద్యాభివృద్ధికి బాటలు వేయాలని యాజమాన్యాన్ని కోరారు. కోదాడ పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలకు పోటీపడి నిర్మించి విజయం అందిస్తున్నారని తెలిపారు పాఠశాలలోఅనుభవం ఉన్న అధ్యాపకులతో విద్యను అందించి ఎన్నో విజయాలు సాధించిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీదేవిని అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థినిగా
విద్యను అభ్యసించినప్పుడు కష్టాలు విద్యను ఏ విధంగా అభ్యసించారొ క్రమశిక్షణతో ఉండా లోపిల్లలకు తెలియజేశారు పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలకు మెమొంటోలు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యేను పూలమాల సాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ ఏడవ వార్డు కౌన్సిలర్ చైతన్య నాయక్ 8 వ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి ఉదయశ్రీ శ్రీనివాస్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్, అధ్యాపక బృందం ,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నార