తాండూరు లో రేపు ఉచిత మెగా హెల్త్

ఆరోగ్యం తాండూర్ రంగారెడ్డి వికారాబాద్

తాండూరు లో రేపు ఉచిత మెగా హెల్త్ క్యాంపు

 

 –జమియతే-ఏ-ఉలేమా వికారాబాద్ వారి ఆధ్వర్యంలో

–క్యాంపు నందు పీడియాట్రిక్స్, కిడ్ని

—గైనకాలజీ తోపాటు బీపీ,షుగర్,ఈసీజీ, వంటి తదితర సమస్యలకు 

—ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 

—జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, హాజరవుతున్నట్టుగా పేర్కొన్నారు

 

మీ:: న్యూస్ ప్రతినిధి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోజమియతే-ఏ-ఉలేమా ఆధ్వర్యంలో రేపు పట్టణంలోని వైట్ ప్యాలెస్ నందు ఉచిత మెగా హెల్త్ క్యాoప్ నిర్వహిస్తున్నట్లుగా జమియతే-ఏ-ఉలేమా వికారాబాద్ కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్ అథ్హర్ ఖాస్మీ పేర్కొన్నారు. ఈ క్యాంపు నందు కేర్ హాస్పిటల్, ఇంటిగ్ర హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సహకారంతో పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లుగా, ఈ క్యాంపు నందు పీడియాట్రిక్స్, కిడ్నిస్ సంబంధించినటువంటి సమస్యలు గైనకాలజీ తోపాటు శిబిరంలో బీపీ,షుగర్,ఈసీజీ, తదితర సమస్యలకు సంబంధించిన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. వాటితోపాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ హెల్త్ శిబిరానికి ముఖ్య అతిథులుగా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, హాజరవుతున్నట్టుగా పేర్కొన్నారు. హెల్త్ క్యాంపు ను నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు క్యాంపు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జమియతే-ఏ-ఉలేమా ప్రతినిధులు పాల్గొన్నారు.