జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి

Uncategorized జన్మదిన వేడుకలు నల్లగొండ మునుగాల సూర్యాపేట

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి

మీ::న్యూస్ 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోలరవీందర్ గౌడ్::మునగాల గ్రామపంచాయతీలో జరిగిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం జరిగిన గ్రామసభలో గ్రామంలో ఉన్న పలు సమస్యలను ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లి తీర్మానం చేయించడం జరిగింది. ప్రధానంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో బోనాల నిర్మాణం తో పాటు తాగునీటి వసతి కల్పించాలని మండల కేంద్రంలోని మున్నూరు కాపు స్మశానవాటిక, ముస్లిం కబరస్తాన్, క్రిస్టియన్స్ బరియల్ గ్రౌండ్ బాగు చేయించి దహన సంస్కారాలకు అణువుగా ఉండే విధంగా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. గ్రామంలో వీధి లైట్లు వెలగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నందున తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను కోరాను. స్పందించిన గ్రామం ప్రత్యేక అధికారి ఆంజనేయులు గారు పంచాయతీ సెక్రటరీ సుధాకర్ గారు దసరా పండుగలోపు వీధి లైట్లు వేయిస్తామని హామీ ఇచ్చారు ఈ పని తక్షణమే జరుగుతూనే నేను కూడా నమ్ముకుంటున్నాను. అదేవిధంగా మసీదు పక్కన జాతీయ రహదారి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మరియు హాస్పటల్ సందులో ఉన్న జానకి రాములు ఇంటి వద్ద ఉన్న డ్రైనేజీ గత పాలకుల నిర్వాకంతో నీరు పోకుండా మురుగునీరు దారిలో నిలిచి ఉండడంతో ఆ దారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దానిని రిపేరు చేయించి చర్యలు తీసుకోవాలని కోరాను. మరియు సిపిఎం ఆఫీస్ నుంచి గౌడ్స్, సాకలి బజార్లో ఉన్న సైడ్ కాలువ మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరాను. దీనికి కూడా ఆఫీసర్లు స్పందించారు. అనంతరం బతుకమ్మ పండుగ సందర్భంగా మా గ్రామం మొత్తం బతుకమ్మ పోటీలు నిర్వహించి మహిళ సోదరీమణులను ఉత్సాహపరిచేందుకు ఉత్సవాలు నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. మహిళా సోదరులు సహకరిస్తామని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ…