అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మీ:: న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ ::మోతే : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మోతే మండల పరిధిలోని గోల్ తండ గ్రామంలో జరిగిన సిపిఎం పార్టీ శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఇండ్లు, ఇళ్ల స్థలాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందుపేదలందరికీఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి తొమ్మిది నెలలు గడుస్తున్న నేటికీ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా నష్టపోయిన పంటలకు, కూలిపోయిన ఇండ్లకు వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. నూతనపింఛన్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను వెంటనే అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అంటు వ్యాధులు, విష జ్వరాల బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులల లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మందుల కొరత నివారించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు గుగులోతు పత్య నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో గ్రామ కార్యదర్శిగా గూగుల్ తు కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండ రాములు, బానోతు లచ్చిరాం, చర్లపల్లి మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు జoపాల స్వరాజ్యం, సిపిఎం సీనియర్ నాయకులు అచ్చాలు, గ్రామ నాయకులు ధరావత్ బిచ్చు, గుగులోతు బాలాజీ, రవీందర్,పుల్ సింగ్, మల్సూర్, సాములు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.