పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేసి వెంటనే పంపిణీ చేయాలనీ సిపిఎం డిమాండ్

Uncategorized తాండూర్ తెలంగాణ రాజాకియం వికారాబాద్

 పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేసి వెంటనే పంపిణీ చేయాలనీ సిపిఎం డిమాండ్

మీ న్యూస్ ప్రతినిధి::సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో హైదరాబాద్ రోడ్ మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి ఇండ్లు లేని పెద ప్రజలకు పంపిణీ చేయాలనీ డిమాండ్ ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలన పేరుతోనే సంవత్సరం పైన గడిచిన డబల్ బెడ్ రూమ్ లు పూర్తి చేయకుండా ప్రజలకు పంపిణీ చేయకుండా పట్టించుకునే పరిస్థితి లేదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును అరులైన నిరుపేదలకు గుర్తించి ఇవ్వకుండా అనేక మంది నిరుపేదలు అద్దె కిరాయి ఇండ్లలో చాలామంది నిరుపేదలు ప్రతిరోజు కూలి నాలి చేసుకొని బ్రతుకు తెరువు కొనసాగిస్తున్నారు విపరీతంగా ధరలు పెరుగుదల వల్లన ప్రజలకు కార్మికులకు తాండూరు పట్టణంలో చాలామంది కిరాయి ఇండ్లలో అద్దె కట్టలేని పరిస్థితి ఉంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పేద ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని ఇప్పటి వరకు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. తాండూరు పట్టణంలో ఉన్న నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ వెంటనే పంపిణీ చేయాలని గత ప్రభుత్వం అనేకసార్లు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని హైదరాబాద్ రోడ్డు మార్గంలో డబల్ బెడ్ రూమ్ నిర్మించి పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారు పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇస్తామని వాటి పేరుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన వాటిని పూర్తి చేయకుండా పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించారు ఇపుడు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను గ్రామాలలో అర్హులైన వారికి గుర్తించి ఇవ్వాలని కార్మికులకు కర్షకులకు అంగన్వాడీ టీచర్స్ కి గ్రామపంచాయతీ వర్కర్స్ కు మున్సిపల్ వర్కర్స్ ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఇండ్లు లేని నిరుపేదలందరు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చాను సిపిఎం నాయకులు బాలస్వామి సంజీవ్ వినోద్ ఎల్లయ్య పాండు తదితరులు పాల్గొన్నారు