హైడ్రా పేరుతో పేదల ఇళ్ళను తొలగిస్తే ఊరుకోం

Uncategorized తాండూర్ తెలంగాణ నల్లగొండ రాజాకియం

హైడ్రా పేరుతో పేదల ఇళ్ళను తొలగిస్తే ఊరుకోం

 సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యాపేట టౌన్: హైడ్రా పేరుతో సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు పక్కన ఉన్న ఇందిరా నగర్ పేదల ఇండ్లను కూలిస్తే చూస్తూ ఊరుకోమని పేదలకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 30 వ వార్డు ఇందిరా నగర్ లో పేదలను కలిసి వారికి సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడుతూ హైడ్రా పేరుతో సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు పక్కన ఉన్న పేదల ఇండ్ల వద్ద అధికారులు మార్కింగ్ చెయ్యడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గత 60, 70సంవత్సరాల క్రితం కొనుగోలు చేసుకుని ఇండ్లకు కరెంటు, నీళ్లు, డోర్ నెంబర్లు తీసుకొని జీవిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజల జోలికి రావడం కరెక్ట్ కాదన్నారు. బాధితులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చి వేస్తామని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తక్షమే అధికారులు పెట్టినమార్కింగ్ లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమేఈ చర్యలను ఉపసంహరించుకోవాలని లేనియెడల పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులునెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులువీరబోయిన రవి, చిన్నపంగానరసయ్య, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం పట్టణ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, షేక్ జహంగీర్,కోడి ఎల్లయ్య,ఉప్పుల రమేష్, కూసు బాలరాజ్ స్థానికులుపద్మ,కవిత,శివరాత్రిప్రమీల,సూరారపు పద్మ,సంధ్యతదితరులు పాల్గొన్నారు.