శ్రీ చైతన్య పాఠశాలలో హెల్తీ ఇండియా ,బతుకమ్మ కార్యక్రమాలు
మీ:: న్యూస్ ప్రతినిధి::తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ లో గల శ్రీ చైతన్య పాఠశాలలో బతుకమ్మ మరియు హెల్తీ ఇండియా కార్యక్రమాలను నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ మదార్ తెలియజేశారు. విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆరోగ్యము, సామాజిక బాధ్యత, సాంకేతిక పరిజ్ఞానము వంటి అంశాల పట్ల పూర్తిస్థాయి పరిజ్ఞానాన్ని అందించేందుకు మరియు పాటించేలా తయారు చేసేందుకు ప్రతినెల స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం పేరిట నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈనెల హెల్దీ ఇండియా ప్రోగ్రాంను ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వ్యాయామం ఆహారపు అలవాట్లు, నిద్ర, యోగ, అనాటమీ తదితర అంశాల గురించి తెలిపి విద్యార్థులు అనుసరించేలా నిర్వహించామని తెలియజేశారు. అనంతరం బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను తెలియపరుస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి వలయంగా తిరుగుతూ పాటలు పాడి విద్యార్థులు నృత్యాలు చేశారు. చివరగా తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ కథ ,విశిష్టత, ఆచారాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ విజయ్, సి బ్యాచ్ ఇంచార్జి ఇర్ఫానా, ప్రైమరీ ఇన్చార్జ్ పూజ ,ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ అనిత ,ఏవో మురళీధర్ రెడ్డి ,పిఈటిలు వెంకటేష్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం వెంకట్ ,స్టేట్ కోఆర్డినేటర్ సురేష్ ,అకాడమిక్ కోఆర్డినేటర్లు వీరస్వామి, తులసి,ఆఫ్రీన్లు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.