కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలుపించాలి

Uncategorized జహీరాబాద్ తెలంగాణ రాజాకియం సంగారెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలుపించాలి

యంపి సురేష్ కుమార్ షేట్కర్ 

 

మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్

 

 మీ న్యూస్ ప్రతినిధి::జహిరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మేల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా జహిరాబాద్ పట్టణం లోని సిద్ది హోటల్ లో నిర్వహించిన సమావేశంలో యంపి సురేష్ కుమార్ షేట్కర్ తో కలిసి మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్సీ అభ్యర్థి డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును ఎండగట్టారు. నిరుద్యోగుల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.అదికారంలోకి వచ్చిన ఏడాదిలో 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది అని అన్నారు. పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించేదుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలిపారు. నిరుద్యోగుల ఉద్యోగాల కల్పనకై కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు మద్దతుఇచ్చి పట్టబద్రులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి యుత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి , డాక్టర్ ఉజ్వల్ రెడ్డి టిజిఐడిసి మాజీ చైర్మన్ తన్వీర్ ,మంకల్ సుభాష్ మండల అధ్యక్షులు హన్మంతరావు పటేల్ ,రామలింగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మహ్మద్ మక్సుద్ అహ్మద్ ,నర్సీంహ రెడ్డి , టౌన్ ప్రెసిడెంట్ కండెం నర్సింహులు కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రుల ఓటర్లు పాల్గొన్నారు.