Uncategorized మోతే రాజాకియం సూర్యాపేట

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలి

⏩:: లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా చేపట్టాలి

 ⏩::ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్మించాలి.

 ⏩::జిల్లా కలెక్టర్ తేజస్వి నందాలాల్ పవర్ 

 

మీ న్యూస్ ప్రతినిధి::మోతే : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మోతే మండల కేంద్రానికి భూభారతి అవగాహన సదస్సు కు హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్వి నందాలాల్ పవర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్నారు. అర్హత లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయవద్దన్నారు. అధికార పార్టీ నాయకులు ఇళ్లలో కూర్చొని లిస్టులు రాసుకొని అర్హత లేనివారికి ఇండ్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. అర్హత లేని వారికి ఇల్లరు మంజూరు చేయవద్దన్నారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. అధికార పార్టీ వారికి ఇండ్లను మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల మోతే మండలంలో అర్హత లేని వారికి ఇండ్లను మంజూరు చేశారని ప్రభుత్వం తక్షణమే రీ సర్వే చేసి అర్హత లేని వారిని తొలగించి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు నాగం మల్లయ్య, దోస పాటి శ్రీనివాస్, జంపాల స్వరాజ్యం, వెలుగు మధు, ఎడమ పద్మ తదితరులు పాల్గొన్నారు.