వార్డ్ నెం.20లో గంటల తరబడి విద్యుత్ అంతరాయం – ప్రజల ఆవేదన
calendar_today
May 23, 2026
person
meenewstelugu
వార్డ్ నెం.20లో గంటల తరబడి విద్యుత్అంతరాయం – ప్రజల ఆవేదన
మీ న్యూస్ తాండూర్ పట్టణం: వార్డ్ నెం.20 పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలు దాటినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అవసరం లేకపోయినా స్ట్రీట్ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. కానీ సాయంత్రం సమయంలో విద్యుత్ లేక ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలి” అని వార్డు ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.