••కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.
మీ న్యూస్ ప్రతినిధి:::సూర్యాపేట జిల్లా::కోల ముత్తమ్మ ఐదో వర్ధంతి ఘనంగా నిర్వహించారు, మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన మీ 31 న్యూస్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ తల్లి కోల ముత్తమ్మ ఐదో వర్ధంతి వేడుకలు గ్రామంలో వైభవంగా నిర్వహించారు.సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా తల్లి గారైన కోల ముత్తమ్మ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.ఇదిగో అమ్మ గురించి కొన్ని హృదయాన్ని తాకే మాటలు: అమ్మ అనేది ఒక పదం కాదు... జీవితాంతం మనకు అండగా నిలిచే అనుబంధం.అమ్మ ప్రేమకు హద్దులు లేవు, షరతులు లేవు.మన మొదటి గురువు అమ్మ, మన మొదటి దేవత కూడా అమ్మే.ప్రపంచం మొత్తం మనల్ని వదిలినా, అమ్మ మాత్రం ఎప్పటికీ మన వెంటే ఉంటుంది.అమ్మ నవ్వులోనే మన సంతోషం, అమ్మ ఆశీర్వాదంలోనే మన విజయం దాగి ఉంటుంది అని అన్నారు..కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కోల జానయ్య గౌడ్, అంబాల ఉమా విజయభాస్కర్, కోల రవీందర్, రాధిక, కోల కృష్ణ, లక్ష్మి, కోల సతీష్, శ్రీనిత, కోల అక్షయ్ గౌడ్, కోల అఖిల్ గౌడ్, మణికంఠ, మన్వేష్, రిషి, కోల హిరణ్య, మానసి తదితరులు పాల్గొన్నారు