34 వార్డ్ లో పల్స్ పోలియో చుక్కల పాల్గొన్న కౌన్సిలర్ పటేల్ సుప్రీతా కరుణాకర్
June 28, 2026
meenewstelugu
34 వార్డ్ లో పల్స్ పోలియో చుక్కల పాల్గొన్న కౌన్సిలర్ పటేల్ సుప్రీతా కరుణాకర్
మీ న్యూస్ తాండూర్:::34 వార్డ్ లో పల్స్ పోలియో చుక్కల పాల్గొన్న కౌన్సిలర్ పటేల్ సుప్రీతా కరుణాకర్ ప్రపంచ పోలియో దినోత్సవంను పురస్కరించుకుని పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.తాండూర్ మున్సిపల్ 34 వార్డ్ లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని పాల్గొన్న కౌన్సిలర్ పటేల్ సుప్రీత కరుణాకర్. వార్డ్ లో ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో నివారణ కోసం పోలియో చుక్కలు వేయించారు,ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలని అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తల్లిదండ్రులకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు