శ్రీ రామ మందిరం పునర్నిర్మాణాన ప్రతిష్టాపన లక్ష రూపాయల విరాళం 

Uncategorized తాండూర్ రాజాకియం వికారాబాద్ విరాళం

శ్రీ రామ మందిరం పునర్నిర్మాణాన ప్రతిష్టాపనల లక్ష రూపాయల విరాళం 

 

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  అలయ పునర్నిర్మాణానికి తనవంతుగా సహకారం

 

ఈనెల 23వ నుండి 25వ వరకు పున ప్రతిష్ట ఉత్సవాలు

ఎమ్మెల్యేకు ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు 

 

 

మీ న్యూస్ తాండూర్::తాండూరు పట్టణంలోని ఇంద్ర నగర్ లో గల ఏకైక రామ మందిరం పునర్నిర్మాణంలో భాగంగా. ఈనెల 23వ తేదీ నుండి 25వ వరకు పున ప్రతిష్టపన కార్యక్రమం. అలాగే 27వ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కీ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందిస్తూ ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. అదేవిధంగా పునర్నిర్మాణంలో భాగంగా ఒక లక్ష రూపాయలను తనవంతు విరాళాన్ని ప్రకటించారు. ఈనెల 23 నుండి 27వ తేదీ వరకు ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన తో పాటు 27వ తేది శ్రీరామనవమి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోందని. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలను అందించి శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందగలరని ఆలయ కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనగలరని తెలిపారు.