అవినీతికి పాల్పడుతున్న డీపీఎం, కంప్యూటర్ ఆపరేటర్స్
సదరం సర్టిఫికెట్స్ జారీ చేయడంలో అవినీతికి పాల్పడుతున్న డీపీఎం, కంప్యూటర్ ఆపరేటర్స్ పైచర్య తీసుకోవాలి
నవంబర్ 11న వికారాబాద్జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి
NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య
మీ న్యూస్ ప్రతినిధి :: వికారాబాద్ జిల్లాలో వైకల్య ధ్రువీకరణ పత్రాలు జరిచేయడానికి నిర్వహిస్తున్న సదరం క్యాంపులో అవినీతికి పాల్పడుతున్న డీపీఎం నర్సిములు, తాండూర్ ఏరియా అస్పత్రి కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశం, వికారాబాద్ కంప్యూటర్ ఆపరేటర్ సంతోష్ లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 11నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నామని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, జిల్లా అధ్యక్షులు జె దశరథ్ తెలిపారు.ఈ రోజు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వికారాబాద్ జిల్లా కమిటీ సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సావిత్రి అధ్యక్షతన జరిగింది,ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో వికలాంగులకు సర్టిఫికెట్స్ జారీ చేయడంలో జిల్లా డీపీఎం నర్సిములు , ఏరియా అస్పత్రి కంప్యూటర్ ఆపరేటర్స్ కుమ్మక్కు అయి నిజమైనా వికలాంగులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.ఒక్కొక్క సర్టిఫికెట్ కావాలంటే 25,000 నుండి 40,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే అర్హత కలిగిన వారికి సర్టిఫికెట్ రాకుండా రిజక్ట్ చేస్తున్నారని అన్నారు.డీపీఎం, కంప్యూటర్ ఆపరేటర్స్ కలిసి వికలాంగులను దోచుకుంటున్నారని అన్నారు.సదరం క్యాంపులో అక్రమాలు జరుగుతున్నాయని జిల్లా అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు.డీపీఎం, కంప్యూటర్ ఆపరేటర్స్ కలిసి వికలాంగులను మోసం చేస్తున్నారని అన్నారు. సర్టిఫికెట్ ప్రింట్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్న జిల్లా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు.బొమ్మరస్ పేట్ మండలం నస్కానపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక కు సర్టిఫికెట్ మంజూరు అయినప్పటికీ డబ్బులు ఇవ్వనందున ఆన్లైన్లో సర్టిఫికెట్ డిలీట్ చేసినరాని అన్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని తెలిపారు. సదరం సర్టిఫికెట్ జారీ కోసం వికలాంగుల నుండి డబ్బులు తీసుకున్న డీపీఎం, కంప్యూటర్ ఆపరేటర్స్ పై చర్య తీసుకోవలని వికలాంగుల నుండి వసూలు చేసిన డబ్బులు తిరిగి వికలాంగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.వికారాబాద్ జిల్లాలో సదరం క్యాంపు నిర్వహణలో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి, సేర్ప్ CEO కు పిర్యాదు చేస్తామని అన్నారు.సదరం క్యాంపు లో జరుగుతున్న అవినీతి, అక్తమాలపై నవంబర్ 11న జరిగే కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సావిత్రి, మురహరి చారి, జిల్లా నాయకులు సత్యమ్మ, నారాయణ గౌడ్, సలీమ్, శంకర్, నందయ్యా, ఆనంద్, అమూబ్ ఖాన్ తదితరులు