మీ న్యూస్ ప్రతినిధి:- తాండూర్ పట్టణం లో ఆరవ వార్డ్ ఇంద్రనగర్ లోని తుల్జా భవాని మాత ఆలయంలో రాజ్ పుత్ సంఘం ఆధ్వర్యంలో నూతన తుల్జా భవాని విగ్రహ పున ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా తుల్జా భవాని ఆలయంలో ఆంజనేయ స్వామి, శివుని లింగం, నవగ్రహాలను ప్రతిష్టించినట్లు రాజ్ పుత్ సంఘం సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తాండూర్ బాలాజీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంపత్ కుమార్, రాజు గౌడ్ , రాజ్ పుత్ సంఘం గౌరవ అధ్యక్షులు సుభాష్ సింగ్, అధ్యక్షులు దిలీప్ సింగ్ ఠాగూర్ , కార్యదర్శి శివనంద్ సింగ్, రాజ్ పుత్ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత ఠాగూర్, ఆలయ ధర్మకర్త శివాజీ సింగ్, భవాని మాత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.