కన్నుల పండుగగా షష్టిపూర్తి వేడుకలు

Uncategorized తాండూర్ బషీరాబాద్ వికారాబాద్ వేడుకలు

కన్నుల పండుగగా షష్టిపూర్తి వేడుకలు

 ⏩:-వందేళ్ల వయస్సు జాబితాలో

 

⏩:-మైల్వర్ గ్రామానికి చెందిన

బిచ్చల హన్మంత్ రెడ్డి

మీ న్యూస్ ప్రతినిధి:తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని మైల్వర్ గ్రామానికి చెందిన బిచ్చల హన్మంత్ రెడ్డి సుభద్ర పుణ్య దంపతుల షష్టిపూర్తి కార్యక్రమ వేడుకలు కొడుకులు , కోడళ్లు బిచ్చల రామ్ రెడ్డి లక్ష్మి, బిచ్చల నాగిరెడ్డి భాగ్యలక్ష్మి, బిచ్చల బీచి రెడ్డి శానమ్మ మరియు బిచ్చల హన్మంత్ సుభద్ర ఏకైక కూతురు ఉషా లక్ష్మి మనుమండ్లు సాయిరాం, మనోజ్, భీమ్,శివ శంకర్ రెడ్డిల మరియు బంధుమిత్రుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబీకులు మాట్లాడుతూ.. సమాజంలో తల్లిదండ్రుల మించిన దైవం లేదంటూ వందేళ్లు నిండిన బిచ్చల హన్మంత్ రెడ్డి, 85 ఏండ్ల వయస్సు గల మా తల్లిదండ్రుల షష్టిపూర్తి కార్యక్రమం నిర్వహించడం పట్ల కుటుంబీకులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. వందేళ్ల. వయస్సు దాటిన అరుదైన రికార్డు జాబితాలో మా తండ్రైన బిచ్చల హన్మంత్ రెడ్డి ఉండడం ఎంతో సంతోషదాయకం. విజయవంతంగా షష్టిపూర్తి కార్యక్రమం నిర్వహించుకున్న. బిచ్చల హన్మంత్ రెడ్డి, సుభద్ర దంపతులు తమ కుటుంబీకులు వ్యాపార రంగంలో మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు.