డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన

 

  మీ:: న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 19:       మోతే పోలీస్ స్టేషన్ పరిది ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మోతే SI యాదవేందర్ రెడ్డి మండల పరిధి లోనీ నామవరం గ్రామంలో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.SI యాదవేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో మూఢనమ్మకాలపై,రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై100 కు సమాచారం ఇవ్వాలని తె లిపినారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నందు హెడ్ కానిస్టేబుల్ శ్రీను, కోటయ్య కానిస్టేబుల్ రాంనరసయ్య కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ, నాగార్జున,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.