తాండూరు హైదరాబాద్ రోడ్డు పనుల ప్రారంభం

Uncategorized తాండూర్ రాజాకియం వికారాబాద్

తాండూరు హైదరాబాద్ రోడ్డు పనుల ప్రారంభం

 

 ⏩::హర్షం వ్యక్తం చేసిన గంజ్ అసోసియేషన్ ప్రతినిధులు.

మీ న్యూస్ ప్రతినిధి::తాండూరు ప్రజల కలగా నిలిచిన తాండూరు హైదరాబాద్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టి పనులను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాండూర్ ది గ్రేట్ అండ్ సీడ్స్ అసోసియేషన్ మర్చంట్ ప్రతినిధులు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూ 49.78 కోట్లతో తాండూరు -హైదరాబాద్ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది.ఈ విషయంపై ది గ్రేడ్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పందిస్తూ..గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న తాండూరు -హైదరాబాద్ రోడ్డు పనులకు నేడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో పనులు ప్రారంభించడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తాండూరు -హైదరాబాద్ రోడ్డు పనులను ప్రారంభించడం మాకు ఎంతగానో ఆనందానికి గురిచేసిందని గంజ్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ముఖ్యంగా తాండూరు వ్యాపార రంగానికి కేంద్ర బిందువు అయిన గంజ్ కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్తక వ్యాపారాలస్తులు, అధికారులు, చాలా ఇబ్బందిగా ఉండేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కానీ ఇట్టి పనిని నేడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి రోడ్డు పనులను ప్రారంభించడం అభివృద్ధికి నాంది అని అన్నారు. ఇందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రాములు గౌడ్, కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, మరియు సభ్యులు కల్వ రాధాకృష్ణ, పటేల్ శ్రీశైలం, నారా జైపాల్ రెడ్డి,భోజిరెడ్డి తదితరులు ఉన్నారు.