ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Uncategorized తెలంగాణ మోతే రాజాకియం సూర్యాపేట

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

 

 ⏩::మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

 

 ⏩::ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలి

 

⏩:: సంక్షేమ పథకాలన్నీ అర్హులైన పేదలకు ఇవ్వాలి

 

 ⏩::సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

 

 ⏩::మోతే తాసిల్దార్ కార్యాలయం ముందు మహా సిపిఎం ధర్నా

 మోతే : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ఆరోపించారు. గురువారం సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలలో అనేక సమస్యలు ఊరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యిందన్నారు. ఎస్సారెస్పీ కాలువ పరిధిలో వేలాది ఎకరాలలో వరి పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అయిన ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహాలక్ష్మి పథకం, రాజీవ్ యువకిరణాలు, రేషన్ కార్డులు అర్హులైన వారికి ఇవ్వాలన్నారు. రాఘవాపురం ఎక్స్ రోడ్డు నుండి సిరికొండ మీదుగా రావి పహాడ్ వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. రాఘవాపురం గ్రామం నుండి మునగాల మండలం రేపాల గ్రామం వరకు డబల్ రోడ్డు నిర్మాణం, హుస్సేన బాధ గ్రామం నుండి బురకచర్ల మీదుగా సర్వారం వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. మండల వ్యాప్తంగా12 గ్రామాలలో15 అంగన్వాడి బిల్డింగులు అసంపూర్తిగా ఉన్నాయని వాటికి బడ్జెట్ కేటాయించి 40 శాతం పూర్తయిన అంగన్వాడీ బిల్డింగులను పూర్తిగా నిర్మించాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కంపాటి శ్రీను, కక్కిరేణి సత్యనారాయణ, బానోతు లచ్చిరాం నాయక్, దోసపాటి శ్రీనివాస్, బూడిద లింగయ్య, జంపాల స్వరాజ్యం, పిడమర్తి అశోక్, నాయకులు ఎర్రబోయిన మాల్సుర్, వెలుగు మధు చేగువేరా, జిల్లాపల్లి నాగయ్య, బానోత్ పాప,ఎర్ర బోయిన నాగమ్మ, బానోత్ హైమ్లా నాయక్, కొప్పువెంకన్న, బానోతు వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.