టిపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా పాలడుగు

Uncategorized తెలంగాణ మోతే రాజాకియం సూర్యాపేట

టిపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా పాలడుగు

మీ న్యూస్ మార్చి 22::తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పాలడుగు పరశురాం నియమితులయ్యారు.సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టిపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో నియామక పత్రాన్ని అందించిన్నట్లు పరశురాం శనివారం జిల్లా కేంద్రంలో తెలిపారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీకి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పిన టీపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మాటలు తన నియామకంలో నియమయ్యాయని అన్నారు.అందుకు మహేష్ గౌడ్ కి,సిఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.అందుకు తనపై ప్రీతం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సంధర్భంగా తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,సహచర మిత్రులకు, కృతజ్ఞతలు తెలిపారు.