మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు 

 

 ⏩::తెలంగాణలో కనుమరుగైపోయిన అనేక పథకాలు 

 ⏩::దసరా పండుగకు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు లేవు 

 

 

 ⏩::రాఘవపూర్ ఎక్స్ రోడ్లో  మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు 

 

 ⏩::మాజీ సీఎం చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 17 :: మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు నందు తెలంగాణ జాతిపిత కెసిఆర్ జన్మదిన సందర్భంగా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు, పలు నాయకులు మాట్లాడుతూ  తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు, తెలంగాణ అనేక పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథకంలో నడిపించిన మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు, బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు కనుమరుగైపోయాయి, తెలంగాణ భారతదేశంలో తెలంగాణ ను నంబర్ వన్  స్థానంలో ఉంది.తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడుపడిన తర్వాత అనేక పథకాలు ప్రజల కు కనిపించడం లేదు హరితహారం దళిత బంధు రైతు రుణమాఫీ వంటి పథకాలు ప్రజలకు కనుమరుగైపోయాయి దసరా వచ్చిందంటే మన తెలుగు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు బతుకమ్మ పాటలతో గ్రామ గ్రామాలలో సంబరాలు నిర్వహిస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ వంటి పథక పండుగలు  నిర్వహించకపోవడం చాలా బాధాకరమైన తెలిపారు, మళ్లీ తెలంగాణకు కెసిఆర్ లాంటి డైనమిక్ లీడర్ సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతె మండల ప్రధాన కార్యదర్శ మద్ది మధుసూదన్ రెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు కారింగుల సత్యనారాయణ గౌడ్. గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి గుండారపు దుర్గయ్య. మాజీ సర్పంచ్ మూడు కృష్ణ. గ్రామ శాఖ ఉపాధ్యక్షులు వీరబోయిన వెంకన్న. గ్రామ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.