⏩::సంగారెడ్డి జిల్లా రైతు హక్కుల సాధన సమితి సంఘం అధ్యక్షుడు చిట్టం పల్లి బల్ రాజ్
మీ న్యూస్ ప్రతినిధి::సంగారెడ్డి జిల్లా రైతు హుక్కుల సాధన సమితి అధ్యక్షుడు చిట్టం పల్లి బాలరాజ్ మాట్లాడుతూ కోహీర్ మండల పరిధిలో ని మద్రి గ్రామం లో టొరెంట్ గ్యాస్ నిర్మాణ పనులను ఊరి నడి మద్యల నుండి చెప్పట్టడం చేత గ్యాస్ వల్ల ఏ సమయంలో ఎమీ.సంభావిస్తుదో..!ప్రజలు భయాందోళన గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .వెంటనే టోరేంట్ గ్యాస్ నిర్మాణ పనులను నిల్పివేయాలని అయన అన్నారు మద్రి .గ్రామస్థులు మాట్లాడుతూ మా గ్రామంలో టొరెంట్ గ్యాస్ నిర్మాణ పనులను ఎలాంటి అనుమతులు తీసుకో కుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. దాదాపు నాలుగు సంవ త్సరాల క్రితం పనులు ప్రారంభించగా వ్యతిరేకించ డంతో పనులు ఆపేశారని అన్నారు. మళ్లీ ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్న ప్రతి సారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా పనులు ఆపడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకే ఊరి చివర్లో ఉన్న గ్యాస్ లీక్ అవ్వడంతో రోజంతా ఇంట్లో పొయ్యి వెలిగించలేదు న్నారు.ఆ సమయంలో భయాందోళన గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఆ దారిన పోయే విద్యార్థుల బస్సులు ఇతర వాహనాలు ఇంజన్ ఆపేసి మరి ప్రయాణం సాగించమని అన్నారు. అంతే కాకుండా ఇరువైపులా వ్యవసాయ భూములు సాగు చేసే రైతులు కూడా ఇబ్బందులు పడుతు న్నారు. గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి వద్దే టోరెంట్ గ్యాస్ ఏర్పాటు చేస్తున్నారు. .పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని ఇటు గ్రామంలో కాకుండా ఇతర స్థలంలో టొరెంట్ గ్యాస్ నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని గ్రామసులు డిమాండ్ చేస్తున్నారు