విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత లేదు

Uncategorized రాజాకియం సూర్యాపేట

విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత లేదు

 ⏩::ఉపాధి హామీకి నిధులు పెంపు లేదు

 ⏩::మట్టిపల్లి సైదులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

 ⏩:మీ న్యూస్ సూర్యాపేట జిల్లా రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 964065960 మార్చి 19::శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన304965 కోట్ల బడ్జెట్ లో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు లేవన్నారు. గత బడ్జెట్ లో2 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం77 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. కేటాయింపులకు ఖర్చులకు పొంతన లేదన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 2500 ఇస్తామన్న ప్రభుత్వం బడ్జెట్ లో కనీస ప్రస్తావన లేదన్నారు. దళితుల సంక్షేమం కోసం అంబేద్కర్ అభయాస్తం ద్వారా దళితులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఈ బడ్జెట్ లో దీని గురించి ప్రస్తావన లేదు అన్నారు. నిరుద్యోగ యువత గురించి ఒక్క మాట చెప్పలేదన్నారు. ఉపాధి హామీకి తగిన నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మఆత్మీయ భరోసాకు నిధులు పెంచాలి.