మీ న్యూస్ ప్రతినిధి. ::::దత్తాత్రేయ కరుణా కటాక్షాలతో సర్వంసుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు.మంగళవారం హోళీ పౌర్ణమి సందర్భంగా ఘాన్ గాపూర్ లోని త్రివేణి సంగమంలో (ఎల్ ,ఎఫ్ ,ఎల్ హెచ్ ,ఎం కోకట్ ప్రధానోపాధ్యాయురాలు వర్య్తకిష్టమ్మ విఠల్ నాయక్)దంపతులు నది స్నానం ఆచరించి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రో చ్ఛారణల తో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదా లను అందజేస్తూ ఘనంగా సన్మానించారు.హోళీ పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు వర్య్త విఠల్ నాయక్ దంపతులు కలిసి అన్నసమర్పణ నిర్వహించారు .ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమిరోజు చేసిన పూజలు, దానధర్మాలు, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయన్నారు. అన్నసమర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాలకన్నా అన్నసమర్పణ గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు. సహజ సిద్ధ రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ పూజారులు రాజు , భక్తులు, తదితరులు ఉన్నారు