శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీస్ తో భాగస్వామ్యం కావాలి.
⏩::స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సందర్భంగా పటిష్ఠమైన పోలీసు నిఘా ఏర్పాటు చేస్తున్నాము.
⏩:: ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే ఎంతటి వారినైనా ఉపేక్షించం.
⏩::కఠిన చర్యలు తీసుకుంటాం.
⏩::సత్యనారాయణ ఐపిఎస్, ఐజిపి మల్టీ జోనల్ 2.
⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని దీనికి పౌరులు భాగస్వామ్యం కావాలని మల్టీ జోన్ 2 ఐజి సత్యనారాయణ ఐపిఎస్ ప్రకటనలో అన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాని సందర్శించిన సందర్భంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారితో కలిసి పోలీసు అధికారులకు ముఖ్యమైన సూచనలు సలహాలు ఇచ్చారు. పోలీసు సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, సమస్యలు సృష్టించే వారిపై నిగా ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అనుక్షణం పర్యటిస్తూ ప్రజలతో మమేకమై శాంతియుత సమాజంలో పౌరల ప్రజల పాత్ర పై, అసాంఘిక చర్యల నిరోధం, సామాజిక అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈనాటి సమాజంలో ఆధిపత్యం కోసం దాడులు చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని, ఇది చట్టరీత్యా నేరం అన్నారు.ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సందర్భంగా గ్రామాల్లో, పట్టణాల్లో, కాలనీలలో ప్రశాంత వాతావరణన్ని నెలకొల్పడం కోసం పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిస్తే సహించేది లేదని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ గ్రామాలు పట్టణాలు కాలనీలలో పర్యటిస్తూ సమస్యలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. పౌరులు ఎవరు కూడా చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు, సమస్యలు ఉంటే చట్టపరిధిలో పరిష్కరించుకోవాలని తెలిపినారు. పోలీసు అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. సమాజంలో అల్లర్లు, అరాచకాలు సృష్టిస్తామంటే పోలీసులు చూస్తూ ఊరుకోరని అలాంటి వారిపై కఠినాతి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమస్యలు సృష్టించే వారిపై రౌడీషీటర్స్ పై ప్రత్యేకంగా ఉన్నదని తెలిపారు. పౌరులు అందరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని IG అన్నారు.