కార్యకర్తలకు కన్న తండ్రీ  నిస్వార్ధ జీవి వర్థెల్లి బుచ్చీరాములు

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

కార్యకర్తలకు కన్న తండ్రీ  నిస్వార్ధ జీవి వర్థెల్లి బుచ్చీరాములు

 

 సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు  నెమ్మాది వెంకటేశ్వర్లు

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 4::సూర్యాపేట :కార్యకర్తలకు కన్న తండ్రీ లాంటి వారు వర్థెల్లి బుచ్చి రాములు అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎం. వి. ఎన్ భవన్ లో జరిగిన బుచ్చి రాములు 6 వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సంధర్బంగా నెమ్మాది మాట్లాడుతూ బుచ్చి రాములు పేద కుటుంబంలో పుట్టి ఎర్రజెండా చేత పట్టి చిన్నతం లోనే పోరాటాలకు దగ్గరయ్యాడని ఆయన అన్నారు.సూర్యాపేట ఆఫీస్ కార్యదర్శిగా పని చేసి కొద్దీ కాలము లోనే తుంగతుర్తి,సూర్యాపేట ఉమ్మడి డివిజన్ వ్యాపితంగా కూలీ, భూమి పోరాటాలు నడిపి పేద వర్గాలకు అండగా ఉద్యమాలు నిర్మించాడని నెమ్మాది తెలిపారు.

పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గా, CPM రాష్ట్ర కమిటి సభ్యులుగా,వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చే శాడన్నారు.1989-95 వరకు సూర్యాపేట తాలూకాలో జరిగిన నిర్బంధాలు, హత్యలు దాడులు , దౌర్జన్యాలు ఎదుర్కోవడంలో కార్యకర్తలకు మనో దైర్యం కల్పించడం లో బుచ్చి రాములు పాత్ర మర్వలేనీదన్నారు.పేద కుటుంబాల నుంచి వచ్చిన కార్యకర్తలను నాయకులుగా తయారు చేయటం లో, కుటుంబాల పట్ల శ్రద్ధ పెట్టడం లో బుచ్చిరాములు ముఖ్య పాత్ర వహించాడు అని అన్నారు.

మారుతున్న రాజకీయా పరిస్థితులు, మతోన్మాద ఉదారవాద విధానాలు ముందుకు వస్తున్న సందర్భం లో బుచ్చి రాములు లేకపోవడం పార్టీకి నష్టమని అయన అన్నారు.రానున్న రోజుల్లో కార్మిక కర్షక, ఐక్య పోరాటాలు చేసి కేంద్రము లో ఉన్న బిజేపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్పుడే బుచ్చి రాములు ఆశయాలు సాధించిన వారౌవుతామని అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, పార్టీ జిల్లా కమిటి సభ్యులు జె .నరసింహారావు, వేల్పుల వెంకన్న, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పిడమర్తిఅశోక్, నందిపాటి సతీష్, యాతాకుల ప్రవీణ్, పి oడిగ గోపి, మనోజ్,రవి, తదితరులు పాల్గొన్నారు.