అరుణోదయ ల రాష్ట్ర స్థాయి విలీన సభను విజయవంతం చేయండి
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయగిరి కంచనపల్లి సైదులు
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 4:సూర్యపేట జిల్లా కేంద్రంలోని తిరుమల గ్రాండ్ లో జరిగే రెండు అరుణోదయ ల రాష్ట్ర స్థాయి విలీన సభను జయప్రదం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయగిరికంచనపల్లి సైదులు కోరారు. స్థానిక చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో విలీన సభను జయప్రదం చేయాలంటూ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ 2013లో చీలినటువంటి ఆరుణోదయ సంస్థలు రెండు సూర్యపేటలో ఏకం కానునన్నట్లు తెలిపారు ఈ సభకు ప్రొఫెసర్ ఖాసీం తదితర నాయకులు హాజరై ప్రసంగిస్తారని దీనిలో పెద్ద ఎత్తున కవులు కళాకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు సభకు ముందు సూర్యాపేట పట్టణంలో పాత మార్కెట్ యార్డ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ ఉంటుందని ఈ సభలో వివిధ జిల్లాలకు చెందిన కవులు కళాకారులు హాజరవుతున్నారని తెలియజేశారు.
ఈ సమావేశంలో అరుణోదయ జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి బోల్క పవన్ పిడమర్తి భరత్ తదితరులు పాల్గొన్నారు