నియామక పత్రం అందజేసిన బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి
బిసి మహిళల అభ్యున్నతికి కృషి చేయాలి
ప్రతి గ్రామాల్లో నూతన కమిటీలను నియమించాలి
-జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
మీ న్యూస్ ప్రతినిధి :: బిసి మహిళల అభ్యున్నతికి మహిళా ప్రతినిధులు కృషి చేయాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు తాండూర్ అసెంబ్లీ డివిజన్ మహిళా అధ్యక్షురాలుగా రాజకాలనీకి చెందిన అనితకు నియామక పత్రం అందజేసిన రాజ్ కుమార్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా బీసీ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు గా అనిత,బిసి మహిళా సంఘం చేస్తున్న అనేక కార్యక్రమంలో అనిత చురుకుగా పాల్గొనవారని అందుకు గుర్తింపుగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశం మేరకు అనితను తాండూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగిందని ప్రతి గ్రామంలో నూతన బిసి మహిళా సంఘాలు ఏర్పాటుకు అనిత కృషి చేయాలని అన్నారు.
అనిత మాట్లాడుతూ నాపై విశ్వాసంతో జాతీయ బీసీ నాయకత్వం జిల్లా బీసీ నాయకులు అధ్యక్షులుగా నియమించినందుకు నాతో పాటు మహిళలు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు త్వరలోనే బీసీ మహిళా సభ ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి బిసి మహిళా సంఘం ప్రతినిధులు లక్ష్మీనర్సమ్మ మంజుల విజయలక్ష్మి బషీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బస్వరాజ్ బీసీ యువ నాయకుడు టైలర్ రమేష్ వివేక్ తదితరులు ఉన్నారు