ఎస్సీ కాలనీలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం..

Uncategorized జాతీయం సూర్యాపేట

ఎస్సీ కాలనీలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం..

 

స్పందించని విద్యుత్ అధికారులు….

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

 సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోనీ రామాపురం గ్రామం ఎస్సీ కాలనీ లో విద్యుత్ స్తంభం ఒక వైపు కు పూర్తిగా ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నదని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపె ట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. డ్రైనేజి కాలువ మధ్యలో విద్యుత్ స్తంభం ఉండటం ఆ కాలువలో నిత్యం నీరు పారుతుండటంతో ఏ క్షణంలో విద్యుత్ స్తంభం పడిపోయి ఏం జరుగుతుందో అని ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైన విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి ఒరిగిన పాత స్తంభంను తొలిగించి కొత్త స్తంభం ఏర్పాటు చేయాలన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో స్తంభాల వరిగి కూలటానికి సిద్ధంగా ఉన్నాయని అలాంటి వాటిని గుర్తించి వెంటనే తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు