టీడీసీఏ టోర్నీలో విన్నర్ TDCA XI జట్టు లో తాండూరు ప్లేయర్ లు సత్తా చాటారు

Uncategorized తాండూర్ వికారాబాద్ స్పోర్ట్స్ హైదరాబాద్

టీడీసీఏ టోర్నీలో విన్నర్ TDCA XI జట్టు లో తాండూరు ప్లేయర్ లు సత్తా చాటారు

 

ఉత్కంఠంగా సాగిన ఫైనల్ మ్యాచ్

 

మీ న్యూస్ ప్రతినిధి:హైదరాబాద్ లోని దోమలగూడలో గురువారం జరిగిన తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అంతర్ జిల్లా టీ-20 క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్ లో టిడిసీఏ లెవెన్ జట్టు 13 పరుగుల తేడాతో ఉమ్మడి జిల్లా జట్టుపై విజయం సాధించింది.

మూడు మ్యాచ్ లలో తాండూర్ కుర్రాళ్ళు శివ శంకర్ ఫైనల్ లో అర్ధ సెంచరీ తో మొత్తం గా 102 పరుగులు, అరుణ్ కుమార్ 7 వికెట్లు 30 పరుగులు, శేఖర్ 4 వికెట్లు 45 పరుగులు, శివ కుమార్ , మక్సూద్ , హర్షిత్ , రోషన్ తలో 2 వికెట్లు తీసి సత్తా చాటారు.మొదట బ్యాటింగ్ చేసిన టిడిసీఏ లెవన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు టికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జట్టులో మహేష్ జాదవ్ 102 పరుగులు, శివశంకర్( తాండూరు) 52 పరుగులు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బౌలర్లు రవి తేజ 2, దీక్షిత్ పాటిల్, శశి చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన మహబూబ్ నగర్ జిల్లా జట్టు 19.3 ఓవర్లలో 169 పరుగులకు అల్ అవుట్ అయింది. జట్టులో సంజు 41, వీరేందర్ 27 పరుగులు చేశారు. బౌలర్లు దీక్షిత్ 3, అరుణ్ (తాండూరు) 2, వికెట్లు తీశారు. 

 TDCA-XI జట్టుకు అభినందనలు

టీడీసీఏ అంతర్ జిల్లా టోర్నీలో TDCA-XI జట్టు విన్నర్ గా నిలవడం పై TDCA-XI కన్వీనర్ & కోచ్ జగన్నాథ్ రెడ్డి, జహీరాబాద్ కోచ్ సంతోష్, నిర్మల్ కోచ్ సుదర్శన్ అభినందించారు. విన్నర్, రన్నర్ జట్లకు తెలంగాణ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి టోపీలు అందజేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.