⏩::తాండూర్ బిసి మహిళా అధ్యక్ష కార్యదర్శుల అనిత మంజుల ఆధ్వర్యంలో సంఘీభావ
⏩::ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
⏩::జాతీయస్థాయిలో కుల గణన చేపట్టాలి
⏩::ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు సెమినార్లు
⏩ పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు కుల సంఘాల నాయకులు
⏩::జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్
మీ న్యూస్ ప్రతినిధి:::పార్లమెంట్లో ఆమోదం పొందిన మహిళా బిల్లులో జనాభా ప్రకారం బీసీ మహిళలకు సబ్ కోట ఇవ్వాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు ఈరోజు ఉదయం తాండూరు పట్టణంలో బిసి మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత కార్యదర్శి మంజుల ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి ఢిల్లీలో బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు సెమినర్లకు మద్దతుగా తాండూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద వారికి సంఘీభావంగా మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు కేటాయించిన 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకు 50 శాతం సబ్కోట కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ మహిళా సబ్ కోటకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించాలని కాలయాపన చేయకుండా బీసీ మహిళలకు సబ్ కోట కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని రాజ్ కుమార్ కోరారు బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని చట్టంతోనే బీసీలకు మహిళలకు న్యాయం దక్కుతుందన్నారు రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య ఉద్యోగ రంగాల్లో కూడా బీసీ మహిళలకు 50% రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని జాతీయస్థాయిలో కుల గణన చేపట్టాలని కేంద్రంలో బీసీల అభివృద్ధికి ఓబీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ సుకుర్ మహిళా సంఘం నాయకురాలు ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి కార్యదర్శి జగదీశ్వరి బషీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమని యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ చారి బీసీ సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్ నాయి బ్రాహ్మణ అధ్యక్షులు పరమేష్ కుమ్మరి సంఘం అధ్యక్షులు పాండు ఆరెకటిక యువ నాయకులు సురేష్ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు రాము ముదిరాజ్ బహుజన యువ నాయకులు శివకుమార్ జుంటుపల్లి వెంకట్ గిరిజాపురం రమేష్ శ్రీధర్ యాసర్ బీసీ నాయకులు మంతటి రాజు బాబా గౌడ్ మోచి రాజు అవేష్ రజక నరసింహ శ్రీనివాస్ నవీన్ మహిళా సంఘం ప్రతినిధులు శోభ జ్యోతి నర్సమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు