సూర్యాపేట మీ న్యూస్ ప్రతినిధి జనవరి 31:త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో మన బిఆర్ఎస్ పార్టీ మండల వ్యాప్తంగా అన్ని స్థానాలలో విజయం సాధించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు
బిఆర్ఎస్ పార్టీ మోతే మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ
ఎన్నికల హామీల అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది
సంవత్సరం కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి నెలకొంది అని
స్థానిక ఎన్నికలలో సత్తాచాటాలి అని ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది అని తెలిపారు సంవత్సరం కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి వచ్చింది అని ఆయన అన్నారు బడికి పోయే పిల్లల నుండి పింఛన్లు అందుకునే అవ్వా తాతల దాకా రోడ్లు ఎక్కారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డిదే అని తెలిపారు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వేల చీరెలు ఇచ్చిండు కేసీఆర్ కిట్లు న్యూట్రీషన్ కిట్లు ఇచ్చిండు చెరువుల్లో చేపలు వేసిండు గొర్రెలు ఇచ్చిండు
కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయి అని అన్నారు నేడు 10వేలు రేపయితే 15వేల రైతు భరోసా అన్నరు మహిళలకు 2500 అన్నడు ప్రతి మహిళకు 25వేల బాకీ పడ్డడు అని తెలిపారు బతుకమ్మ చీరెలు అన్నడు 500 ఇస్తడు అన్నడు ఎగ్గొట్టిండు అని అన్నారు వృద్ధులకు 4వేల పింఛన్ ఇస్తా అని మాట తప్పిండు
ఇచ్చే రెండు వేల పింఛన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు అని గుర్తు చేశారు పింఛన్లు దగా
అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసిండు అని ఆయన తెలిపారు ఓట్ల ముందు డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ అన్నడు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆగస్టు 15నాటికి పూర్తి చేస్తా అన్నడు అని గుర్తు చేశారు దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు రుణమాఫీ డిసెంబర్ 9 2024 వరకు చేస్తానని ఇప్పుడు అంటున్నారు అది కూడా 3లక్షల మందికే అట ఈ రుణమాఫీ పైసలన్నా పడ్డయి అంటే బీఆర్ఎస్ పార్టీ నిలదీయడం వల్లనే అని ఆయన గుర్తు చేశారులక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది పెద్ద మోసం
నిరుద్యోగ యువత పై అరాచకం చేస్తున్నారు ఆరు గ్యారెంటీల బాధ్యత నాది అని చెప్పిన సోనియా గాంధీ ఎక్కడున్నారు అధికారం వచ్చాక పత్తా లేకుండా పోయారు కాంగ్రెస్ వికృత వైఖరి పట్ల గ్రామ గ్రామాన చర్చలు పెట్టాలి ప్రజలు, రైతులు, యువత అందరికీ అర్థమయ్యేలా వివరించాలి అని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు ఆరె లింగారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి మండల నాయకులు పగడాల వెంకట్ రెడ్డి యుగేందేర్ రెడ్డి నకిరేకంటి మల్లయ్య జిల్లపెల్లి ముత్తయ్య పల్స మల్సూర్ అయితబోయిన జగన్ ఇండ్ల వెంకటేశ్వర్లు అండెం నారాయణ యూత్ అధ్యక్షులు జానిపాషా బిఆర్ఎస్వి అధ్యక్షులు దోసపాటి నరేష్ నాయకులు ఇండ్ల మణికంఠ ఎల్లెంకి నరేష్ వేణు ఎల్లెంకి సైదులు వెంకన్న అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు