బధిరుల పాఠశాలలో అన్న ప్రసాదం వితరణ 

Uncategorized నల్లగొండ సూర్యాపేట

బధిరుల పాఠశాలలో అన్న ప్రసాదం వితరణ 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతిని ఫిబ్రవరి 06:: అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట మండలం లోని అపూర్వ బధిరుల పాఠశాల లో గురువారం అన్నప్రసాదం వితరణ చేశారు.శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్ యజమాని రాఘవ శెట్టి సుమిత్ర దంపతుల కుమార్తె చార్వి పుట్టినరోజు సందర్బంగా వారి సహకారం తో ఇట్టి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏ బి ఏ పి జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు సదాచర్ ట్రస్ట్ బాద్యులు మిర్యాల శివ కుమార్ లు మాట్లాడుతూ అన్ని దానం లకన్నా అన్నదానం మిన్న అని అన్నారు. అన్నదానం చేయడం మూలంగా అన్నపూర్ణ దేవి,అన్నదాన ప్రభువు అయినా అయ్యప్ప స్వామి అనుగ్రహం లభిస్తుందని అన్నారు. పుట్టినరోజు నా, పెళ్లిరోజునా సమాజంలోని ప్రతి ఒక్కరు సేవా భావనతో పనిచేయాలని, నిరాశ్రయులను చేరా దీసి మనకు తోచిన సహాయం చేయాలనీ అప్పుడే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు గాని ఇతరులు ఎవరైనా ఇట్టి కార్యక్రమం లో భాగస్వామ్యం కావచ్చు అన్నారు.ఈ కార్యక్రమం లో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మాప్రచార సభ జిల్లా సభ్యులు శిల్ప నాగభూషణం, శేఖర్, సుకేష్ శెట్టి, గణేష్ శెట్టి , రంగు స్వాతి పాఠశాల నిర్వాహకురాలు డి సరిత తదితరులు పాల్గొన్నారు..