గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని

Uncategorized తాండూర్ రాజాకియం వికారాబాద్

గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని

ఉద్యోగ భద్రత కల్పించాలి

రాష్ట్రవ్యాప్తంగా ఈ నేల   27, 28 టోకెన్ సమ్మె జయప్రదం చేయాలి

మీ న్యూస్ ప్రతినిధి ::: తెలంగాణ గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తాండూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీ కార్మికులందరు ఈనెల 27 28వ తేదీలలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికై టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చాము అందుకు మన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు )ఆధ్వర్యంలో సందర్బంగా సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను ఐక్యం చేసి ఈనెల 27 28వ తేదీన ప్రతి మండల కేంద్రంలో టోకెన్ సమ్మె ఎంపీడీవో కార్యాలయాల ముందు టెంటుపడే విధంగా చూడాలని కోరుతూ

డిమాండ్స్

. గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని గ్రీన్ చాలన్ ద్వారా వేతనాలు చెల్లించాలి

. రెండవ పిఆర్సి పరిధిలోకి గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకురావా లి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలి

. జీవో నెంబర్ 51ని సవరించాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. పాత కేటగిరి లన్నింటిని కొనసాగించాలి కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిలు గానీ నియమించాలి అర్హులైన సిబ్బందిని ప్రమోషన్లు కల్పించాలి

. పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలి ఇన్సూరెన్స్ ఈఎస్ఐపి సౌకర్యం కల్పించాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయాలి

. పంచాయతీ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేయాలి వేతనాలు పెంచాలి

. ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేసి నేరుగా వారికి కూడా వేతనాలు చెల్లించాలి పంచాయతీల అవసరాల ప్రాతిపదికన కార్మికుల సంఖ్యను పెంచాలి

. కార్మికులందరికీ ఇందిరమైన్లు ఇండ్ల పథకాలు కేటాయించాలి

. చనిపోయిన అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి

పై డిమాండ్ల పరిష్కారం కోసం మన యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో టెంటు పడటానికి చర్యలు తీసుకోవాలి మరియు కరోబార్ మరియు ఇతర పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈ సమ్మెను ముఖ్యముగా భావించి రాష్ట్ర ప్రభుత్వానికి మన యూనియన్ మరియు జేఏసీ పటిష్టతను తెలియజేస్తూ ఈ సమ్మెను విజయవంతం చేయాలని సమస్యల పరిష్కారానికి ఇదే సరైన మార్గమని రాబోయే కొద్ది రోజులలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్నందున సమస్యలు పరిష్కారం కావాలి రాష్ట్రంలో కొంతమంది కారో బార్ నాయకులు మన సమస్యలు పరిష్కారం అవుతాయని పోరాటాలు చేయొద్దని గత ఐదు సంవత్సరాల నుండి చెబుతూ అదిగో పులి ఇదిగో తోక అన్న చందంగా పంచాయితీలోని కారోబార్ సిబ్బంది లను ఇబ్బందుల పాలు చేస్తున్నారు మన యూనియన్ పంచాయతీలో పనిచేస్తున్న అన్ని తరగతుల ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుంది అది గమనించి జేఏసీగా ఏర్పడ్డాం ఇప్పటికి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకొని మీరు యూనియన్ ఏమి చేస్తుందో చూసి ఇతర సంఘాల మాయమాటలు. నమ్మకుండా జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సమ్మెను విజయవంతానికి సహకరించాలని కోరుతున్నాము.