సీతారాం ఏచూరి మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు…

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

సీతారాం ఏచూరి మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు…

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు 

మీ::న్యూస్ ప్రతినిధి 

 మోతే : సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిమరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు.శనివారం శుక్ర వారం సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ఏచూరి మరణం సిపిఎం పార్టీ ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని అత్యంత మేధావిని దేశం కోల్పోయిందని అన్నారు. సీతారాం ఏచూరి గత 50 ఏళ్లుగా సిపిఎం పార్టీలో అత్యంత చురుకుగా కీలకంగా సిద్ధాంతానికి కట్టుబడి నిబద్ధతతో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చిన మొక్కవోని దీక్షతో విప్లవ సాధన కోసం కార్మిక కర్షక పక్షపాతిగా తుది శ్వాస వదిలేవరకు పోరాడిన గొప్ప వ్యక్తిత్వం గల ఏచూరి ఆశయ సాధన కోసం కట్టుబడి ఉంటామని ఏచూరి కలలుగన్న సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు పోరాడుతామనిఅన్నారు.నేడు భారతదేశంలో మతోన్మాదం ప్రైవేటీకరణ ప్రజానీకానికి పెను ప్రమాదంగా మారాయని ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదంపై ప్రైవేటీకరణ పై జరిగే పోరాటాల్లో సిపిఎం కార్యకర్తలు సానుభూతిపరులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.1974 లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిన సీతారాం ఏచూరి 1977-78లో మూడుసార్లు జెఎన్ యు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారని అన్నారు. 1978లో ఎస్ఎఫ్ఐ అఖిలభారత జాయింట్ సెక్రటరీగా ఎన్నిక అయ్యారని గుర్తు చేశారు.1984 లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారని, ఆ తర్వాత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా,2005 నుండి పశ్చిమ బెంగాల్ నుండి మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారని అన్నారు.2015,2018,2022లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కొనసాగుతున్నారని అన్నారు.దేశం గొప్ప మేధావిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అనేక సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ అభివృద్ధికి ఆయన చేసినసేవలు, సూచనలు మరువలేనివి అన్నారు. గత 40సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారని అన్నారు.దేశంలోప్రజలకు మేలు జరిగే చట్టాలు వచ్చాయి అంటే అందులో సీతారాం ఏచూరి కృషి మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, దోసపాటి శ్రీను, చర్లపల్లి మల్లయ్య, దోసపాటి చిన్న శ్రీను, చర్లపల్లి యాదమ్మ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.