వ్యసనాలకు దూరంగా ఉంటూ..ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి

Uncategorized ఆరోగ్యం తాండూర్ తెలంగాణ వికారాబాద్

వ్యసనాలకు దూరంగా ఉంటూ..ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి

 

నైతిక జీవన శైలి అలవర్చుకొని ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి

– కార్డియోలజిస్ట్ దయ వాస్వని

–  తాండూరు IMA అధ్యక్షులు డా. జయప్రసాద్, బీసీ నాయకులు కందుకూరి రాజ్ కుమార్

మీ న్యూస్ ప్రతినిధి :::
యువజాగృతి ఆధ్వర్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) తాండూరు సహకారంతో నిర్వహించిన గుండె పోటుతో యువతలో సంభవించే ఆకస్మిక మరణాల నివారణ అంశం పై హోటల్ హిమాలయాలో జరిగిన అవగాహన కార్యక్రమం వివరణాత్మకంగా, సుదీర్ఘంగా కొనసాగింది.

  కార్డియోలజిస్ట్ దయ వాస్వని మాట్లాడుతూ గుండె ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ద వహించాలి అని వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు కలిగి శారీరిక శ్రమ చేయాలి అని 18ఏళ్ల వయస్సు నుండే షుగర్, బి.పి,థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ లాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అని,ముఖ్యంగా యువత ఆరోగ్యం పై అశ్రద్ధ వహిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని ఇప్పటికైనా ఆరోగ్యం పై శ్రద్ద వహించి ఏ మాత్రం అనుమానం ఉన్న డాక్టర్ను సంప్రదించి వారి సూచనలు కచ్చితంగా పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనం కోనసాగించాలి అని ఆమె సూచించారు, అలాగే వచ్చిన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, జాగ్రత్తలు సూచించారు.

డా. జయప్రసాద్  మాట్లాడుతూ అందరూ ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి అని నాటు వైద్యం,సొంత వైద్యం చేసుకోవద్దు అని ఆరోగ్య జీవనశైలి అలవర్చుకోవాలి అని భవిష్యత్తులో తాండూరు IMA తరుపున ఆరోగ్య అవగాహన క్యాంపులు చేపడతాం అలాగే తాండూరు ప్రజలకు ఎల్లప్పుడూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు అని ఆయన అన్నారు.

కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చాలా అవసరం అని, ఆరోగ్యం పై అందరూ అవగాహన పెంచుకొని శ్రద్ధ వహించాలి అని ఆయన కోరారు.

యువ జాగృతి అధ్యక్షుడు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ యువతలో ఆకస్మిక మరణాలు బాధాకరం అని కచ్చితంగా వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని, భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహేష్ ఠాకూర్, ఆస్తికర్ సంతోష్, జుంటుపల్లి వెంకట్ యువజాగృతి సభ్యులు నరసింహ, శివ, నరేష్,వినోద్ తదితరులు పాల్గొన్నారు.