మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27:సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబ శివ స్వామి వారి మహాశివరాత్రి వేడుకలు సందర్భంగా చివరి రోజు గురువారం మహా పూర్ణాహుతి నిర్వహించి,శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి అన్నాభిషేకం నిర్వహించారు. గత మూడు రోజులుగా పూజలు నిర్వహించిన ప్రధాన కలశమును స్థానచలనం మహాశివరాత్రి వేడుకలు పరి సమాప్తి చేశారు. అనంతరం అన్నాభిషేక ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. కార్యక్రమంలో శ్రీ సంతోషి మాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్త, బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్, ఆలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ ,భట్టారం వంశీకృష్ణ శర్మ,పబ్భ ప్రకాశరావు, బెలిదే అశోక్, తాళ్లపల్లి రామయ్య, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవర శెట్టి సోమయ్య, గోపారపు రాజు, యామ వెంకటేశ్వర్లు, బ్రాహ్మ0డ్లపల్లి శివప్రసాద్, బ్రాహ్మ0డ్లపల్లి దేవి దత్తు, మహంకాళి ఉపేందర్ ,కక్కిరేణి పద్మావతి, కర్నాటి సూర్యకళ, మహంకాళి కవిత, బెలిదేఅశోక లక్ష్మి, కంచర్ల లీల, సూరం సునీత, బచ్చు నీరజ, శైలజ, ఓరుగంటి కనక రత్నం,ఓరుగంటి జగదీశ్వరి, ఈగ విజయలక్ష్మి, మంత్రాల పద్మ, పోతుగంటి కృష్ణవేణి, గోపారపు స్వరూప రాణి,బచ్చు పురుషోత్తము తదితరులు పాల్గొన్నారు.